ACP వసుంధర యాదవ్ IPS కల్లూరు సబ్ డివిజన్
ఖమ్మం జిల్లా :- ఎన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనుప చువ్వల దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – దొంగిలించిన ఇనుప చువ్వలు, ఆటో స్వాధీనం
ఎన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనుప చువ్వల దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
ఎన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఇనుప చువ్వలు దొంగతనం జరిగినట్లు 19.08.2026 మధ్యాహ్నం అందిన ఫిర్యాదు మేరకు ఎన్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
దర్యాప్తులో భాగంగా 21.08.2026 న దొంగిలించిన ఇనుప చువ్వలను ఆటోలో తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను చింతల సాయి గణేష్ (22), బేతాలపాడు గ్రామం మరియు కిల్లి వెంకటేష్ (25), స్వగ్రామం ఇబ్రాహింబాదు, శ్రీకాకుళం జిల్లాగా గుర్తించడం జరిగింది.
నిందితుల వద్ద నుంచి దొంగిలించిన సుమారు 50 కిలోల ఇనుప చువ్వల ముక్కలు మరియు వాటిని తరలించేందుకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితులు నాచారం బ్రిడ్జి వద్ద ఇనుప చువ్వలను దొంగిలించినట్లు వెల్లడించారు. కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

