PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 1:20 pm Posted by : PORU TELANGANA

గంగారం గ్రామ అభివృద్ధికి కృషి..

నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్..

గంగారం గ్రామ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం గంగారం సర్పంచ్ మునావత్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేఎల్ఆర్ ను కలిశారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కేఎల్ఆర్ పేర్కొన్నారు. గ్రామానికి బీటీ రోడ్డు, సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గంగారం పంచాయతీకి నాలుగు లక్షల రూపాయలతో స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. త్వరలోనే పనులను ప్రారంభించే విధంగా చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రవి, మోహన్, దేవ, జయరాం, సోమ్లా, శ్రీనివాస్ పాల్గొన్నారు.