PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 10:46 am Posted by : bhumeshwar161664x@gmail.com

గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమీక్ష సమావేశం

మెండోర మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండల ఎస్సై సుహాసిని తెలిపారు. మండల కేంద్రంలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులతో, యువజన సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గణేష్ మండపాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీలు పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకోవాలని అన్నారు. ఎలాంటి అనుమతి లేదని ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.