చింతకుంటలో ఘనంగా తీజ్ నిమజ్జన మహోత్సవం

సెప్టెంబర్ 05: సిర్పూర్ (టి): సిర్పూర్‌ (టి) మండలం చింతకుంట గ్రామంలో తొమ్మిది రోజులుగా ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాలు శనివారం నిమజ్జన మహోత్సవంతో ముగిశాయి. సర్పంచ్‌ అజ్మేర చత్రునాయక్‌ ఆధ్వర్యంలో, చింతకుంట నాయక్‌ అజ్మేర మోహన్ నాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ బంజారా–లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగల్లో తీజ్ ఒకటని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతి పట్ల సద్భావనను...