సెప్టెంబర్ 05
సిర్పూర్ (టి):చీలపల్లి, మేడిపల్లి, మాలిని గ్రామాల సర్పంచులు కలిసి అసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి మేడం ని కలిసి చీలపల్లి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన సమస్యను వివరించడం జరిగింది.గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మేడం గారికి వివరించగా, మేడం గారు సమస్యపై సానుకూలంగా స్పందించి, పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.మూడు గ్రామాల ప్రజల రాకపోకలకు ఎంతో ముఖ్యమైన ఈ బ్రిడ్జి సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాము. అని చీలపల్లి ,మేడిపల్లి , మాలిని గ్రామాల సర్పంచులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.