సెప్టెంబర్ 06:
జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్నూర్,గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగుపై పోలీసుల దాడి చేశారు.ee తనిఖీలు మూడు కేసు లలో 460 గంజాయి మొక్కలు స్వాధీనం,వేర్వేరు కేసులలో నల్గురు నిందితులను గంజాయి సాగు,అక్రమ రవాణా, నిల్వకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ నితికా పంత్ అని అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని బుర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో నిషేధిత గంజాయి సాగు చేస్తున్నట్లు అందిన విశ్వసనీ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ నితికా పంత్,పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో బుర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జీర్లఘాట్,గుట్టగూడ గ్రామా శివారులలో తనిఖీలు
చేపట్టగా,అక్కడ అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలు గుర్తించారు. దీంతో పోలీసులు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని,గంజాయి సాగుకు పాల్పడుతున్న మూడు వేర్వేరు కేసులలో మొత్తం నల్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు కాబడిన నిందితుల వివరాలు:1) గెడం లోబాజీ ,2) గెడం జయవంత్ ,బూర్నూరు గ్రామ పంచాయతీ లోని జీర్లగాట్ నివాసులు1) కుమ్రా మాధవరావు,బూర్నూరు గ్రామ పంచాయతీ లోని జీర్లగాట్ నివాసుడు 1)పెందోర్ సూర్యబాను,గుట్టగూడ గ్రామస్తుడు గా పోలీసులు గుర్తించారు, నిందితులు వారి వ్యవసాయ భూమిలలో సాగు చేస్తున్న మొక్కలను పోలీసు వారు గుర్తించారు. ఈ ఘటనలలో నిందితుల పై పోలీసు వారు సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు. గంజాయి సాగుకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
గంజాయి సాగు చేసినా, గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా లేదా అక్రమ కార్యకలాపాలకు సహకరించినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు లేదా మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలను కోరారు.
మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా,తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి సాగు మరియు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారని జిల్లా ఎస్పీ తెలపారు.