అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన

అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక కేంద్రం – మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక సమానత్వం, విద్య, కళలు, సాంస్కృతిక విలువలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లోని సైబర్ మెడోస్ వెంచర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...