PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 5:29 pm Posted by : PORU TELANGANA

ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి-సీపీ అంబర్ కిషొర్ ఝా

ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి-సీపీ అంబర్ కిషొర్ ఝా

పెద్దపల్లి// రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.చెడు వ్యసనాలకు, ముఖ్యంగా గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్‌లోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎన్టీపీసీ టీటీఎస్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణకుమార్,సైబర్ నేరాల విభాగం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ– ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులే తొలి గురువులని,వారి తర్వాత ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని సూచించారు.
చదువు,వ్యక్తిగత జీవితం లేదా ఇతర అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పంచుకోవాలని తెలిపారు. సమస్యలను మనసులో దాచుకోకుండా వారితో మాట్లాడితే సరైన మార్గనిర్దేశం లభిస్తుందని అన్నారు.విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వారి భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908కు తెలియజేయాలని సూచించారు.
సైబర్ నేరాల విషయంల

వినాయక చవితిని పురస్కరించుకుని తెలంగాణ సైబర్ భద్రతా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన “వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు” అనే అవగాహన పోస్టర్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ బి.రామ్‌రెడ్డి ఆవిష్కరించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్న రీతిలో వివరిస్తూ ఈ పోస్టర్‌ను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, బసంత్‌నగర్ ఎస్‌ఐ శ్రీధర్,రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్‌ఐ వెంకట్,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.జయరాజ్, స్థానిక కార్పొరేటర్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.