వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన.

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన. లక్షెట్టిపేట పోరు తెలంగాణ , సెప్టెంబర్ 4: లక్షెట్టిపేట పట్టణంలోని బీట్ బజార్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చన చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు....