PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 6:34 pm Posted by : PORU TELANGANA

నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులకు ఘన సన్మానం

నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులకు ఘన సన్మానం

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలపై అవగాహన

గోదావరిఖని

సేవే లక్ష్యం.. సమాజమే కుటుంబం అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్న పరికిపండ్ల నరహరి IAS ఆదేశాలు, మార్గదర్శకత్వంతో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో గురువులకు ఘన సన్మానం నిర్వహించారు.

గురువుల పట్ల శ్రీ పరికిపండ్ల నరహరి IAS కి ఉన్న అపారమైన గౌరవం, కృతజ్ఞతాభావం ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచింది. తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడంలో గురువుల పాత్రను ఎప్పటికీ మరువకుండా, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించే నరహరి IAS గారి సేవా దృక్పథాన్ని సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను ముఖ్య అతిథి జంగపల్లి రమాదేవి, చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ శివకీర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ ఫౌండేషన్ మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్ మాట్లాడుతూ,
“నరహరి IAS ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన ఎదుగుదలకు కారణమైన గురువులను ఎప్పటికీ మరిచిపోరు. గురువులను స్మరించుకోవడం, గౌరవించడం ఆయనలోని గొప్ప సేవా సంస్కారానికి నిదర్శనం. సమాజానికి సేవ చేయాలనే ఆయన స్ఫూర్తితోనే ఆలయ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది” అని అన్నారు.

ఆలయ ఫౌండేషన్ సభ్యులు మీలంక సురేష్ మాట్లాడుతూ, ఒక విద్యార్థి విజయం వెనుక తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని అన్నారు.

ఆలయ ఫౌండేషన్ సభ్యులు శివచారి మాట్లాడుతూ, గురువులను సన్మానించుకోవడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఒక వ్యక్తి జీవితాన్ని మంచి మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత గొప్పదని అన్నారు.

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ శివకీర్తి మాట్లాడుతూ, నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులను గౌరవించడం, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.