PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 12:01 pm Posted by : PORU TELANGANA

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

సర్పంచ్ ధార నరసింహ..

మహేశ్వరం, సెప్టెంబర్ 5, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గొల్లూరు గ్రామ సర్పంచ్ ధార నరసింహ తెలిపారు. శనివారం గొల్లూరు గ్రామంలో రేషన్ కార్డు (స్మార్ట్) కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన వారు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. గ్రామంలో 200 మందికి రేషన్ కార్డులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎలిగని రమేష్ గౌడ్, సెక్రెటరీ కల్పనారెడ్డి, విఆర్ఓ స్వప్న, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Copyright © 2026 PORU TELANGANA. All rights reserved.