PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:17 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు. రైతులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సూచనలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 07: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రూరల్ మండలంలోని అరెగూడ గ్రామంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న 16 మంది రైతులను, కపాస్ క్రాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగు చేస్తున్న ఐదుగురు రైతులను సన్మానించారు. అనంతరం ఆయిల్ పామ్ గెలల కొనుగోళ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, రైతులు ధాన్యం, పత్తి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. యాసంగిలో మక్క, జొన్న, పెసర, పుచ్చకాయలు, కూరగాయలు వంటి పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ధాన్యం, మక్క, పత్తి పండించే రైతులకు పూర్తి మద్దతు ధర దక్కేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే 1,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని, ఈ ఏడాది మరో 1,000 ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఆయిల్ పామ్ రైతులకు నాలుగో ఏట నుంచి ఎకరానికి రూ. లక్ష, ఎనిమిదో ఏట నుంచి రూ. 2 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు.