ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు. రైతులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సూచనలు.
పోరు తెలంగాణ అక్టోబర్ 07: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రూరల్ మండలంలోని అరెగూడ గ్రామంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న 16 మంది రైతులను, కపాస్ క్రాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగు చేస్తున్న ఐదుగురు రైతులను సన్మానించారు. అనంతరం ఆయిల్ పామ్ గెలల కొనుగోళ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు...