పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈ నెల 30న టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కావేటి సబితా మనోహర్ పిలుపునిచ్చారు. అనంతరం గూడ ప్రతులను విడుదల చేశారు.కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కావేటి సబిత మనోహర్ నాయకులతో కలిసి తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, ఇక్కడి ప్రజలకు వైద్యం, విద్య, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అందడం లేదని అన్నారు. ఈ పరిస్థితిని గమనించిన కవిత, జిల్లా ప్రజలకు అండగా నిలిచేందుకే ఈ సభను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దేవల వీరన్న, జిల్లా అధ్యక్షులు కిర్మిల వినోద్ చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అశోక్ మహుల్కార్, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.