ఎస్పీఎం కార్మికులకు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి. కార్మికుల పక్షాన నిలిచిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు.
కోర్టులో వేసిన పిటిషన్ యాజమాన్యం వెనక్కి తీసుకోవాలి.... పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్నగర్: సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) కార్మికులకు యూనియన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న హైకోర్టు పిటిషన్లను యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఎస్పీఎం కార్మికుల పక్షాన నిలుస్తూ, వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ఎస్పీఎంలో పనిచేస్తున్న కార్మికులకు తమ యూనియన్ను ఎన్నుకునే అవకాశం కల్పించాలని నాయకులు పేర్కొన్నారు....