PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:21 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

ఎస్సీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా డాక్టర్ అశోక్ మహుల్కర్ ఘన సన్మానం

పోరు తెలంగాణ అక్టోబర్ 07: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.

వాంకిడి మండలం ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ అశోక్ మహుల్కర్‌ను బుధవారం వాంకిడి మండల కేంద్రంలో వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా సన్మానించారు. దళిత సమాజానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయి బాధ్యత లభించిందని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సమాజ సేవలో ముందుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులతో పాటు అంబేడ్కర్ సంఘం, భారతీయ బౌద్ధ మహాసభ, సమతా సైనిక దళ్, సిద్ధార్థ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.