పోరు తెలంగాణ 06: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.
రాష్ట్ర
ఎస్సీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారతీయ బౌద్ధమసభ అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహల్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా నిర్మించినట్లు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందజేసినట్లు ఆయన తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ , జిల్లా కార్యవర్గం ప్రతిపాదనలు చేయడంతో సామాజిక సేవ దృక్పథం, ముందుచూపు ఉన్న డాక్టర్ అశోక్ మాహుల్కర్ ని నియమించినట్లు ఆయన అందుల పేర్కొన్నారు.డాక్టర్ బి అర్ అంబెడ్కర్ ఆశయ సాధన కోసం,రాష్ట్ర ఎస్సీల సంక్షేమ,అభివృద్ధి, కోసం కృషి కృషి చేయనున్నట్లు ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకమైన డాక్టర్ అశోక్ మహుల్కర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.