ఓల్డ్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.
బతుకమ్మ ఆడిన మహిళలకు బహుమతులు అందజేసిన టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత.... పోరు తెలంగాణ అక్టోబర్ 11: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్నగర్: పట్టణంలోని ఓల్డ్ కాలనీలో ఉన్న ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో,...