కాగజ్ నగర్ మండలంను కరువు మండలంగా ప్రకటించాలి. రైతుల డిమాండ్.
కాగజ్ నగర్ పోరు తెలంగాణ 05: కాగజ్ నగర్ మండలంలో పత్తి , కంది, వరి ఇతర పంటలు పండించే రైతులు గత కొన్ని రోజులుగా వర్షం కోసం ఎదురు చూడగా వర్షం రాకపోవడంతో' పంటలకు సాగునీరు అందక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని కోసిని మాజీ సర్పంచ్ నగునూరి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాగజ్నగర్ మండలంను కరువు మండలంగా ప్రకటించి రైతులకు కరువు సహాయక చర్యలు చేపట్టాలని కాగజ్నగర్ ఎంపీడీ ఆఫీసులో ప్రజావాణిలో దరఖాస్తు చేశారు.