PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 7:16 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

గుడుంబా, మట్కా, కోడిపందాలకు సంబంధించిన 17 మందిని బైండోవర్ చేసిన బెజ్జూర్ పోలీసులు.

పోరు తెలంగాణ అక్టోబర్ 13: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.  బెజ్జూర్ మండల పరిధిలో గుడుంబా, మట్కా మరియు కోడిపందాలకు సంబంధించిన కార్యకలాపాలకు పాల్పడిన మొత్తం 17 మంది వ్యక్తులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మరియు తహసీల్దార్, బెజ్జూర్  ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేయడం జరిగింది. ఇకపై సదరు వ్యక్తులు గుడుంబా, మట్కా, కోడిపందాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా, ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉండాలని బైండోవర్ చర్యలు చేపట్టడం జరిగిందని బెజ్జూర్ ఎస్‌ఐ రమేష్  తెలిపారు. బెజ్జూర్ మండల పరిధిలో ఎవరైనా గుడుంబా తయారీ, విక్రయాలు, మట్కా, కోడిపందాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రమేష్  హెచ్చరించారు. అలాగే, మండల పరిధిలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు లేదా పైన పేర్కొన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు ఫోన్ నెంబర్ 8712670541 కి సమాచారం అందించాలని అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.