దహేగాంలో మీ సేవ కేంద్రాల తనిఖీ. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని అధికారుల సూచన.

పోరు తెలంగాణ అక్టోబర్ 14: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. దహెగాం మండలంలోని మీ-సేవ కేంద్రాలను జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఈడీఎం) గౌతమ్ రాజ్, జిల్లా మీ-సేవ మేనేజర్ గోపతి ప్రశాంత్ బుధవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలు, దరఖాస్తుల స్వీకరణ, సేవల పరిష్కార ప్రక్రియ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కేంద్రాల పనితీరును సమీక్షించి, సేవలను సకాలంలో అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు. మీ-సేవ కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా...