PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 11:38 am Posted by : gajanandmanthri@gmail.com

దాంపూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం ఐదవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం

భీమారం మండలం ధాంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 5వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని సర్పంచ్ చేగొండ కుమార్ , ఉప సర్పంచ్ చీడం రామక్క ఆధ్వర్యంలో  గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా సామాజిక తనిఖీ డీఆర్‌పీ (DRP) రమేష్ గత ఆర్థిక సంవత్సరంలో ధాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనుల వివరాలను గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామంలో చేపట్టిన పనులు, వాటి అమలు తీరు, సంబంధిత రికార్డులు తదితర అంశాలపై వివరాలను తెలియజేశారు.

సామాజిక తనిఖీతో పారదర్శకతకు ప్రాధాన్యం

ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడం, గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం ప్రధాన లక్ష్యాలు. ఈ పథకం కింద నిర్వహించిన పనుల వివరాలను ప్రజల సమక్షంలో పరిశీలించడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు సామాజిక తనిఖీ కార్యక్రమం దోహదపడుతుంది.

గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను ప్రజలకు తెలియజేయడం, పథకం అమలుపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలకు ఈ కార్యక్రమం ప్రాధాన్యతనిచ్చింది.