దాంపూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం ఐదవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం

భీమారం మండలం ధాంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 5వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని సర్పంచ్ చేగొండ కుమార్ , ఉప సర్పంచ్ చీడం రామక్క ఆధ్వర్యంలో  గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా సామాజిక తనిఖీ డీఆర్‌పీ (DRP) రమేష్ గత ఆర్థిక సంవత్సరంలో ధాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనుల వివరాలను గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామంలో చేపట్టిన పనులు,...