పెండింగ్ వేతనాలు,రూ.1.40 కోట్ల పిఎఫ్ బకాయిలు చెల్లించాలని సిఐటియు డిమాండ్. బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన మునిసిపల్ కార్మికులు.

పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కాగజ్‌నగర్ మండలం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ – సీఐటీయూ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ పట్టణ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు సీఐటీయూ పోరాట పాటలు పాడుతూ, కార్మిక బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.కార్మికులు బతుకమ్మ ఆడుతున్న సమయంలో మున్సిపల్ కమిషనర్ విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆటకు ఆటంకం కలిగించారని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా...