భీమారం
మండల ప్రెస్ క్లబ్ రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రభుత్వాల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లడంతో పాటు, ప్రజల గొంతుకగా నిలిచి సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని ప్రెస్ క్లబ్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం, ప్రజలకు న్యాయం జరిగేలా వార్తా కథనాల ద్వారా కృషి చేయడం ప్రెస్ క్లబ్ ప్రధాన లక్ష్యమని సభ్యులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోగా అధ్యక్షుడిగా కాసిపేట రవి, గౌరవ అధ్యక్షుడిగా సాయిని శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా నాంపల్లి చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీగా నూతి నాగరాజు, కోశాధికారిగా నరేష్, కార్యవర్గ సభ్యుడిగా గజానంద్ ఎన్నికయ్యారు.
రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రభుత్వాలు మరియు సంబంధిత అధికారుల దృష్టికి ప్రజల ఇబ్బందులను తీసుకెళ్లేందుకు ప్రెస్ క్లబ్ కృషి చేయాలని నూతన కమిటీ నిర్ణయించింది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, నిష్పక్షపాత వార్తా సేకరణతో ప్రజల పక్షాన నిలుస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.