ప్రజల గొంతుకగా ప్రెస్ క్లబ్, మూడో ఏడాదిలోకి అడుగు.

భీమారం మండల ప్రెస్ క్లబ్ రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రభుత్వాల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లడంతో పాటు, ప్రజల గొంతుకగా నిలిచి సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని ప్రెస్ క్లబ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం, ప్రజలకు న్యాయం జరిగేలా వార్తా కథనాల ద్వారా కృషి చేయడం ప్రెస్ క్లబ్ ప్రధాన లక్ష్యమని సభ్యులు...