భీమారం శ్రీ నవదుర్గా భవాని ఉత్సవ సేవాసమితి ఆధ్వర్యంలో మహా చండీయాగం.

భీమారం శ్రీ నవదుర్గా భవాని ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గ మాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా మండపం వద్ద మహా చండీ యాగాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. తొలుత గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా చండీ యాగంలో భాగంగా వేద మంత్రాల పారాయణం, హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని,...