భూములు రీ సర్వే పకడ్బందీగా జరగాలి. రెవెన్యూ సిబ్బందికి శిక్షణ ఇచ్చిన జిల్లా కలెక్టర్ కె. హరిత.

పోరు తెలంగాణ అక్టోబర్ 08: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భూముల రీ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లు, జీపీవోలు, రెవెన్యూ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు...