భూముల రీ సర్వేకు మండలానికి 2 బృందాలు. సి సి ఎల్ ఏ లోకేష్ ఆదేశం.

పోరు తెలంగాణ అక్టోబర్ 12: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. ఆసిఫాబాద్ జిల్లాలో భూముల రీ సర్వే కోసం ప్రతి మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేయాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) లోకేష్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ముఖ్య ఆదేశాలు ప్రతి మండలంలో నాయబ్ తహసీల్దార్, గిర్దావర్ లేదా సీనియర్ అసిస్టెంట్ పర్యవేక్షణలో రెండు బృందాలు...