పోరు తెలంగాణ అక్టోబర్ 07:
వ్యవసాయానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు విఫలమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎలాంటి జాప్యం లేకుండా మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలను టీజీఎన్‌పీడీసీఎల్ చేపడుతోందని జియం ఆపరేషన్-1 బాబురావు పేర్కొన్నారు. మంగళవారం సిర్పూర్ కాగజ్‌నగర్ రూరల్ సెక్షన్ పరిధిలోని గన్నారం డిస్ట్రిబ్యూషన్‌లో విఫలమైన 3-ఫేజ్ 25 కేవీఏ డీటీఆర్ స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసే పనులను జియం ఆపరేషన్ బాబురావు పర్యవేక్షించారు. విఫలమైన డీటీఆర్‌ను గుర్తించిన వెంటనే ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి వ్యవసాయ విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విఫలమైన ట్రాన్స్‌ఫార్మర్లను రోజువారీగా గుర్తించి, అవసరమైన చోట వెంటనే ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, మరమ్మతులకు గురైన ట్రాన్స్‌ఫార్మర్లను ఆలస్యం లేకుండా రిపేర్ చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు సూచించారు. రైతులకు నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించేలా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ సిర్పూర్ కాగజ్‌నగర్ రూరల్, డీఈ ఎంఆర్‌టీ సిర్పూర్ కాగజ్‌నగర్ తదితర అధికారులు పాల్గొన్నారు.