రైతులకు నిరంతర వ్యవసాయ విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి.
పోరు తెలంగాణ అక్టోబర్ 07: వ్యవసాయానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు విఫలమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎలాంటి జాప్యం లేకుండా మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలను టీజీఎన్‌పీడీసీఎల్ చేపడుతోందని జియం ఆపరేషన్-1 బాబురావు పేర్కొన్నారు. మంగళవారం సిర్పూర్ కాగజ్‌నగర్ రూరల్ సెక్షన్ పరిధిలోని గన్నారం డిస్ట్రిబ్యూషన్‌లో విఫలమైన 3-ఫేజ్ 25 కేవీఏ డీటీఆర్ స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసే పనులను జియం ఆపరేషన్ బాబురావు పర్యవేక్షించారు. విఫలమైన డీటీఆర్‌ను గుర్తించిన వెంటనే ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి వ్యవసాయ విద్యుత్ సరఫరాను త్వరితగతిన...