రైతుల సాగునీటి సమస్యపై రాత్రివేళ స్పందించిన సబ్‌ కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు..

రేపటి నుంచే నీరు విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు – రైతుల్లో హర్షం.... పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్, సిర్పూర్ మండలాల పరిధిలో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో, సాగునీరు విడుదల చేయాలని రైతులు చేపట్టిన పోరాటానికి అధికారులు స్పందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సమస్యను తెలుసుకున్న కాగజ్‌నగర్ సబ్‌ కలెక్టర్ రాత్రి వేళ అని కూడా చూడకుండా భామనగండి చెరువు వద్దకు, రైతుల పొలాల వద్దకు స్వయంగా...