PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:02 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ చేయాలను వినియోగించుకోండి. కాగజ్ నగర్ లో నవంబర్ 5 వరకు ఉచిత వైద్య సేవలు ఎమ్మెల్యే హరీష్ బాబు.

పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్ పట్టణ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ (రైలు పట్టాలపై ఆసుపత్రి) ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ, నేటి నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఆపరేషన్లు, పిల్లలకు ఎముకల ఆపరేషన్లు, ప్లాస్టిక్ సర్జరీలు ఉచితంగా చేస్తారని తెలిపారు. ఈ సేవలపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని డీఎంహెచ్‌వో సిడాం నాగేంద్ర, డీసీహెచ్‌ఎస్ డా. అవినాష్‌లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హరిత, సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, తహసీల్దార్ మల్లెపూల మధుకర్, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ట్రస్టీ డా. రోహిణి చౌగులే, పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు పాల్గొన్నారు.