సాయిరాం యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

మండలంలోని రావీ చెట్టు వాడలో సాయిరాం యూత్ దుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారుల భవిష్యత్తుకు విద్యాబుద్ధులు కలగాలని ఆకాంక్షిస్తూ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని, మహిళల భాగస్వామ్యంతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు...