కాగజ్ నగర్ అక్టోబర్ 04:
కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్‌లో సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బారెగూడ సర్పంచ్ కోట వేణుగోపాల్ ను సిర్పూర్ తాలూక సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు డోంగ్రి సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో నియోజకవర్గ పరిధిలోని పలువురు సర్పంచులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం వంటి అంశాలపై సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.తాలూకా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్న సర్పంచులందరికీ కోట వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి కోసం, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.