పోరు తెలంగాణ అక్టోబర్ 14: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో ఈ నెల 29న నిర్వహించే 70వ ధమ్మ చక్ర ప్రవర్తన్ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేడ్కర్ సెంటర్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్ కోరారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్, మాలి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుర్ణులే నారాయణ, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సందీప్‌లతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లుంబిని దీక్ష భూమిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా లుంబిని దీక్ష భూమి నుంచి బుద్ధుడు, అంబేడ్కర్ ప్రతిమలతో శోభాయాత్ర, ర్యాలీ ఉంటాయని, అనంతరం ప్రముఖుల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా ఇన్‌చార్జి విజయ్ ఉప్రే, ఆర్గనైజర్ రోషన్ ఉప్రే, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు దుర్గం దుర్గాజీ, ఉపాధ్యక్షుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు.