నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలు రద్దు

Hyderabad//తెలంగాణలో 35 మంది ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల నియామకాలను ఇంటర్మీడియట్ విద్యాశాఖ రద్దు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. రెగ్యులరైజేషన్ సమయంలో సమర్పించిన విద్యార్హత సర్టిఫికెట్లను సంబంధిత విశ్వవిద్యాలయాలతో అధికారులు వెరిఫై చేయగా, అవి ఆయా యూనివర్సిటీల ద్వారా జారీ కాలేదని నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 360 మంది జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్లను పరిశీలించగా, 37 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అందులో 35 మంది నియామకాలను అక్టోబర్ 1న రద్దు చేసినట్లు సమాచారం. మిగిలిన సర్టిఫికెట్ల...