జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వర్క్‌షాప్‌లోని ఫర్నిచర్, పలు బంగారు ఆభరణాలు కాలిపోయినట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో యజమాని, సిబ్బంది అప్రమత్తమై కొంత ఆస్తిని కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.