ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో జరిగిన రోహిత్ వేముల తెలంగాణ బిల్లుపై క్యాబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశంలో సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల హక్కుల పరిరక్షణ, కులం, సామాజిక నేపథ్యం ఆధారంగా వివక్షకు తావులేకుండా సమగ్ర చట్టం రూపొందించే అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించడం జరిగింది. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, వివక్షను నిరోధించడం, విద్యాసంస్థల్లో న్యాయబద్ధమైన వాతావరణాన్ని బలోపేతం చేయడం ఈ ప్రతిపాదిత చట్టం ప్రధాన లక్ష్యాలు. ఈ దిశగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నేతృత్వంలో న్యాయశాఖ, విద్యాశాఖ, హోంశాఖ, యూజీసీ తదితర సంస్థల భాగస్వామ్యంతో కమిటీ ఏర్పాటు చేసి, అవసరమైన న్యాయపరమైన, సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించాలని...