PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 7:52 pm Posted by : PORU TELANGANA

ఇబ్రహీంపట్నం ఆర్యవైశ్య సంఘంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. ఆటపాటలతో పండుగ వాతావరణం…

మెట్ పల్లి  //ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పాటలు, కోలాటాలతో పండుగ వాతావరణం నెలకొంది.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పూల పండుగగా పేరొందిన బతుకమ్మ మహిళల ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. బతుకమ్మ సంబరాలతో ఆర్యవైశ్య సంఘం ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.