లలిత కళా తోరణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పోరు తెలంగాణ న్యూస్// హైదరాబాద్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ,మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మ పాటలను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది.