ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో లోక్ భవన్ నిరసన
ఓటర్ల సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు చలో లోక్ భవన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకమైన ప్రక్రియను నిర్వహించాలి. ఈ అంశంపై సమాధానం చెప్పాల్సిన సీఈసీ...