పిల్లలు ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాలకు గురికాకుండా వారికి అవసరమైన భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థ (TGLSA) సూచనలు, కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
డిజిటల్ వేదికలపై పిల్లల రక్షణ కోసం వ్యవస్థలను బలోపేతం చేయడానికి న్యాయసేవల సంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (NALSA) ఆధ్వర్యంలో “డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం : ఆన్లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం” అన్న ఇతివృత్తంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సు హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సదస్సులో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ,...