PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 10:32 am Posted by : PORU TELANGANA

కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో దసరా వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

దసరా పండుగ వేడుకల్లో భాగంగా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. తన స్వగ్రామం నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో దసరా వేడుకలకు హాజరయ్యారు.

 

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి గారు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.