PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 10:31 pm Posted by : PORU TELANGANA

కమిషనరేట్‌లో పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల నిర్వహణ, అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు,పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన,షార్ట్ ఫిల్మ్,ఫోటోగ్రఫీ పోటీలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

దేశ శాంతిభద్రతలు, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

📌 ఓపెన్ హౌస్ కార్యక్రమాలు:

పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల విధులు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, పోలీసుల ప్రతిభ, త్యాగాలను ప్రజలకు వివరించనున్నారు.

📌 వ్యాసరచన పోటీలు:

పోలీస్ సిబ్బందికి రెండు కేటగిరీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.

కేటగిరీ–1: కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకు

 

1. What services do the people expect from the Police in a democratic setup?

2. Role of Social Media in Police Officers’ lives – how to overcome addiction to social media and use it gainfully for personal and social benefit.

 

కేటగిరీ–2: ఎస్‌ఐ మరియు పై స్థాయి అధికారులకు

 

1. What should the Police do to earn respect and goodwill from the citizens?

2. Strengthening of ground-level policing.

ఈ పోటీలను తెలుగు,ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. వ్యాసం 500 పదాలకు మించకూడదు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డులు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

📌 రక్తదాన శిబిరాలు,సైకిల్ ర్యాలీలు:

పోలీస్ అమరవీరుల స్మరణార్థం రక్తదాన శిబిరాలు,సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. సైకిల్ ర్యాలీల్లో యువత, విద్యార్థులను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేయనున్నారు.

📌 అమరవీరుల కుటుంబాల పరామర్శ:

పోలీస్ అధికారులు అమరవీరుల కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అమరవీరుల విగ్రహాలు లేదా ఫొటోలు ఉన్న ప్రాంతాల్లో ఇన్‌స్పెక్టర్ స్థాయి లేదా అంతకంటే పై స్థాయి అధికారులు గ్రామ పెద్దలు,యువత, విద్యార్థుల సమక్షంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.

📌 షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు:

పోలీస్ అమరవీరుల త్యాగాలు,పోలీసుల విధులు,ప్రతిభ, ప్రజల రక్షణ వంటి అంశాలపై యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు షార్ట్ ఫిల్మ్,ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొనాలని కమిషనర్ కోరారు.

పాల్గొనేవారు 3 ఫోటోలు మరియు 3 నిమిషాలకు మించని షార్ట్ ఫిల్మ్ రూపొందించి సమర్పించాలి. ఫోటోలు 10×8 అంగుళాల పరిమాణంలో ఉండాలి.షార్ట్ ఫిల్మ్‌ను పెన్‌డ్రైవ్‌లో పూర్తి వివరాలతో అందజేయాలి. కమిషనరేట్ స్థాయిలో ఎంపికైన మూడు ఉత్తమ షార్ట్ ఫిల్మ్స్,ఫోటోలను రాష్ట్రస్థాయి పోటీల కోసం డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించనున్నారు.

ఫోటోలు,షార్ట్ ఫిల్మ్‌లను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రంలోగా స్పెషల్ బ్రాంచ్ (NIB) కార్యాలయంలో అందజేయాలి.

📌 అవగాహన కార్యక్రమాలు:

అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు ప్రజా ప్రదేశాల్లో పోలీస్ కళాబృందం ద్వారా పోలీస్ అమరవీరుల త్యాగాలను తెలియజేసే పాటలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ప్రధాన కూడళ్లలో పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేయనున్నారు.

 

అక్టోబర్ 21న స్మృతి పరేడ్

 

అక్టోబర్ 21న పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా “స్మృతి పరేడ్”, “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించనున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.