కమిషనరేట్‌లో పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల నిర్వహణ, అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు,పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన,షార్ట్ ఫిల్మ్,ఫోటోగ్రఫీ పోటీలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. దేశ శాంతిభద్రతలు, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 📌 ఓపెన్ హౌస్ కార్యక్రమాలు: పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల విధులు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల...