ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

  హైదరాబాద్, అక్టోబర్ 10 ji ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా పోరాటాలు నిర్వహిస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ (EU–NMU–TMU) కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందనలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఎంప్లాయిస్ యూనియన్ కూటమిపై కార్మికులు మరోసారి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అద్దె సంఘాలకు మద్దతు ఇచ్చి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆర్టీసీ కార్మికులు తమ ఓటు ద్వారా...