ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులో విషాద ఘటన
దసరా సెలవులకు ఇంటికొచ్చి తల్లిదండ్రుల ముందే కుప్పకూలి మృతిచెందిన కుమారుడు
పదో వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, విజయ దంపతులకు కుమార్తె కీర్తి, కుమారుడు, హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ.. పండగ సెలవులకు రెండ్రోజుల క్రితమే ఇంటికొచ్చిన రాఘవ ద్విచక్రవాహనంపై దుస్తులు అమ్మే వ్యక్తి ఉదయం వీరి ఇంటి వద్దకు రావడంతో తల్లి అవి చూస్తుండగా, నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి అంటూ మంచంపై కూర్చుంటూనే కింద పడిపోయిన రాఘవ. ఒక్కసారిగా పడిపోవడంతో సీపీఆర్ చేసి, ఆటోలో వైరాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించి గుండెపోటుతో మృతిచెందాడని నిర్ధారించిన వైద్యులు.