తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, అక్టోబర్ 10: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఎల్నినో పరిస్థితులు క్రమంగా బలపడే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 శాతం లోటు వర్షపాతం నమోదవుతోందని, భవిష్యత్తులో ఈ లోటు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సాగునీటి లభ్యత తగ్గే అవకాశం...