PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 5:51 pm Posted by : PORU TELANGANA

రైస్ మిల్లులో పిడిఎస్ బియ్యం అక్రమ నిల్వ.. పట్టుకున్న అధికారులు

 

ధర్మారం// పెద్దపల్లి జిల్లాలో గత కొంతకాలంగా పిడిఎస్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమార్కుల జేబులు నింపేందుకు ఆసరాగా నిలుస్తుంది. అధికారులు ఎన్నిసార్లు పట్టుకుని కేసులుపెట్టినా అక్రమార్కుల దందాలు మూడు పువ్వులుఆరుకాయలు అనే చందంగా మారింది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం గ్రామంలో శుక్రవారం శ్రీలక్ష్మి నరసింహ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. విశ్వాసనియ సమాచారం మేరకు ఎస్ ఐ ఎంబడి శ్రీకాంత్ పోలీసు సిబ్బంది, పౌరసరఫరాల అధికారులు డిప్యూటీ తాసిల్దార్ పోచయ్య, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకట రాజిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ ను సంయుక్తంగా రైస్ మిల్లు లో తనిఖీలు నిర్వహించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న. రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 18 కింటల్లా బియ్యంతో పాటు రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని పరిశీలించి స్వాధీన పరుచుకున్నరు. పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించిన వ్యక్తిని అతనికి సహకరించిన మరో వ్యక్తితో పాటు మిల్లు యజమానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎంబడి శ్రీకాంత్ తెలిపారు.